తెలంగాణ

ధర్నాలు మానుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26:తెలంగాణలోని 11 విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ అధ్యాపకుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని వెంటనే ధర్నాలు మానుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. 11విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ అధ్యాపకులు ఆదివారం రోజున కడియం శ్రీహరిని కలిసి తమ సమస్యలు వివరించారు. ఓ పక్క పరీక్షలు సమీపిస్తున్న సమయంతో పాటు, మరో పక్క శాసన మండలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు సమ్మె చేయడం సరైంది కాదని ఉపాధ్యాయులకు కడియం సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తక్షణమే సమ్మెను విరమించాలని సూచించారు. జీతాల పెంపు, సర్వీసును క్రమబద్ధీకరణ చేయడం కోసం ప్రభుత్వం కమిటీ వేసి అధ్యయనం చేయించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ అధ్యాపకుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. త్వరలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు కూడా జరుగనున్న నేపథ్యంలో, విశ్వవిద్యాలయంలో చక్కని వాతావరణం నెలకొల్పేలా, విశ్వవిద్యాలయ అభివృద్ధికి దోహదపడేలా అధ్యాపకులు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోరారు.
ఆందోళన విరమణ
దీంతో 13 రోజుల నుంచి చేస్తున్న ఆందోళనలను అధ్యాపకులు విరమించుకున్నారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించారు.

చిత్రం..కాంట్రాక్టు అధ్యాపకులతో మాట్లాడుతున్న డిప్యుటీ సిఎం కడియం శ్రీహరి