తెలంగాణ

యాదాద్రిలో ధ్వజారోహణం.. దేవతాహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 28: యాదాద్రి దేవస్థానం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు మంగళవారం ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం, గరుడముద్ద, భేరీ పూజ, దేవతాహ్వానం, హవనం కార్యక్రమాలను వేద పండితులు, అర్చక బృందం శాస్తయ్రుక్తంగా వైభవంగా నిర్వహించారు. బాల ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలను ప్రధానార్చకులు నందీగల్ నరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యుల ఆధ్వర్యంలో పాంఛరాత్ర ఆగమశాస్త్రానుసారం నిర్వహించారు. పంఛనరసింహుడిగా యాదాద్రిపై కొలువైన లక్ష్మీనరసింహుల బ్రహ్మోత్సవానికి, తిరు కల్యాణోత్సవానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు స్వామివారి సేవకుడైన గరుత్మంతుడిని పంపిస్త్తూ నిర్వహించిన ధ్వజారోహణ, గరుడముద్ద, దేవతాహ్వాన కార్యక్రమాల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గరుడముద్ద ప్రసాద స్వీకరణతో సంతానఫలం, సకల శుభాలు చేకూరుతాయన్న నమ్మకంతో భక్తులు గరుడముద్దల కోసం పోటీ పడ్డారు. ఆలయ అనువంశీక ధర్మకర్త నరసింహామూర్తి, అర్చక పండితులు పాల్గొన్నారు.
గుట్టలో నేడు: స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవా రం నుండి స్వామివారికి అలంకార, విశేష వాహన సేవలు ప్రారంభంకానున్నాయి. బుధవారం లక్ష్మీనరసింహుడిని మత్స్యావతార అలంకార సేవ, శేష వాహన సేవలు నిర్వహిస్తారు. ఆలయ పునర్ నిర్మాణం నేపథ్యంలో అలంకార, వాహన సేవలన్నీ కూడా బాలాలయంలోనే నిర్వహించనున్నా రు. స్వామివారి దర్శనం, బ్రహ్మోత్సవ కార్యక్రమాలను వీక్షించి స్వామివారిని సేవించకునేందుకు భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుండగా అందుకు దేవస్థానం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.