తెలంగాణ

డబుల్ బెడ్‌రూమ్‌కు కేంద్ర ప్రభుత్వ స్థలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: జిహెచ్‌ఎంసి పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్థలాలను సేకరించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఆయా శాఖల కేంద్ర మంత్రుల వద్దకు స్వయంగా మంత్రులు వెళ్లి స్థలాలను ఇవ్వాలని కోరనున్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంపై మంత్రి కెటిఆర్ మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మార్చి నాటికి సాధ్యమైనన్ని ఎక్కువ ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యేలా చూడాలని చెప్పారు. నగరంలో భూమి కొరత ఉన్నందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న భూములను ఈ కార్యక్రమానికి కేటాయించే విధంగా చూడాలని మంత్రి కెటిఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. ఈ మేరకు అవసరమైన పరిపాలనా పరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. నిరుపయోగంగా వివిధ శాఖల వద్ద ఉన్న భూములను కోరాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులకు ఆయా మంత్రులను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేయాలని కెటిఆర్ చెప్పారు. ఈ మేరకు రైల్వే శాఖ నుంచి సమావేశానికి హాజరైన అధికారులు వారం రోజుల్లో రైల్వే భూములపై జిహెచ్‌ఎంసికి నివేదిక ఇస్తామని చెప్పారు.