తెలంగాణ

చకచకా డబుల్ బెడ్‌రూమ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 1: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 600 ఎకరాలు గుర్తించినట్టు మున్సిపల్‌శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి నిధుల కొరత లేదని, దీని కోసం హడ్కో నుంచి తీసుకున్న నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో బుధవారం మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు.
తమ ప్రభుత్వం నిర్మించే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు దేశంలోనే పక్కా గృహాల నిర్మాణంలో ఒక మాడల్‌గా నిలిచిందన్నారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. వచ్చే రెండేళ్లలో స్కైవేల నిర్మాణం పూర్తి చేసేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా రియల్ ఏస్టేట్ రంగంలో దేశంలోనే హైదరాబాద్ నంబర్ వన్‌గా నిలిచిందన్నారు.