తెలంగాణ

పదవుల పందేరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 1: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకేసారి పది కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ బుధవారం సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. నియమితులైన పదిమందిలో ఐదుగురు మైనార్టీలకు అవకాశం కల్పించి ఆయా వర్గాలకు పెద్దపీట వేశారు. సెట్విన్ చైర్మన్‌గా హైదరాబాద్‌కు చెందిన ఇనాయత్ అలీ బేగ్, స్టేట్ ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ బుడాన్ బేగ్, స్టేట్ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా అదే జిల్లాకు చెందిన కె కోటేశ్వర్‌రావు, నెడ్‌క్యాప్ చైర్మన్‌గా నిజామాబాద్ జిల్లాకు చెందిన సయ్యద్ అబ్దుల్ అలీమ్, స్టేట్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్‌గా వరంగల్ జిల్లాకు చెందిన మహ్మద్ యూసుఫ్ జహీద్, అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపీ కేశవరావు కుమారుడు కె విప్లవ్‌కుమార్, స్టేట్ గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా కరీంనగర్ జిల్లాకు చెందిన సయ్యద్ అక్బర్ హుస్సెన్, తెలంగాణ స్టేట్ హ్యాండి క్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా వరంగల్ నగరానికి చెందిన బొల్లం సంపత్‌కుమార్ గుప్తా, తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా రంగారెడ్డి జిల్లాకు చెందిన గౌండ్ల నాగేందర్‌గౌడ్‌ను నియమించారు. సాధారణ పరిపాలనశాఖ వీరి నియామకానికి సంబంధించి జీవో 580 బుధవారం సాయంత్రం విడుదల చేసింది.