తెలంగాణ

ప్రమాదంలో సెక్యులరిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: కేంద్రంలోని మోదీ సర్కార్ వ్యవహార శైలితో లౌకిక వ్యవస్థకు తీవ్ర ప్రమాదం వాటిల్లిందని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. లౌకిక వ్యవస్థ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజాసంఘాలు పోరాడాలని పిలుపునిచ్చారు. గురువారం నాడిక్కడ మగ్ధుం భవన్‌లో జరిగిన వివిధ రాష్ట్ర స్థాయి ప్రజా సంఘాల నాయకుల సమావేశంలో సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాల్లో దళితులు, అణగారిన వర్గాలపై నిత్యం దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులను నిరసిస్తూ భావ స్వేచ్ఛ కోసం దేశ వ్యాపితంగా పోరాటాలు చేయాలని కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకిచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంతలో విఫలమయ్యారని అన్నారు.