తెలంగాణ

ఎమ్మెల్యేలకు కోటిన్నర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: నియోజకవర్గం అభివృద్ధి నిధులకు మోక్షం లభించింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత నియోజకవర్గ అభివృద్ధి నిధుల పథకం పునరుద్ధరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఒక్కో నియోజకవర్గానికి కోటి 50 లక్షల రూపాయల చొప్పున నిధులు విడుదల చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమానంగా కోటి 50 లక్షల రూపాయలు నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించారు.
2016-17 సంవత్సరానికి సంబంధించి నిధులు విడుదల చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గాల అభివృద్ధికి మూడు కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇందులో కోటిన్నర రూపాయలను ఇంతకుముందే విడుదల చేశారు. ఈరోజు తిరిగి నియోజక వర్గానికి మరో కోటిన్నర విడుదల చేశారు. శాసన మండలి ఎన్నికల కోసం కోడ్ అమలులో ఉన్న జిల్లాల్లో ఈ నిధులతో పనులు మంజూరు చేయవద్దని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ- గద్వాల జిల్లాల్లో నియోజకవర్గ అభివృద్ధి నిధులకింద కోడ్ అమలులో ఉన్నంత వరకు ప్రతిపాదనలు ఆమోదించవద్దని సూచించారు. ఎన్నికల కోడ్ తరువాత ఈ జిల్లాల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటారు.