తెలంగాణ

విజ్ఞాన కేంద్రాలుగా గ్రంథాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రంథాలయాలను విజ్ఞాన కేంద్రాలుగా రూపొందిస్తామని గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ తెలిపారు. పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ గురువారం నాడు ఆంధ్రభూమి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ, ఇప్పటి వరకు ఏవో కొన్ని పత్రికలు, పుస్తకాలకు కేంద్రాలుగానే గ్రంథాలయాలను పరిగణిస్తూ వస్తున్నారన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా పెరుగుతున్న సాంకేతిక విజ్ఞానానికి అనుగుణంగా వీటిని రూపుదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పోటీ పరీక్షలకు, దేశ, విదేశాల్లో ఉపాధికి ప్రయత్నించే యువతకు ఉపయోగపడే కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఒకవైపు సమాజం అత్యంత వేగంగా ముందుకు వెళుతూ ఉంటే గ్రంథాలయాలను ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కొనసాగించడంలో ఔచిత్యం లేదన్నారు.
తాత్కాలిక అవసరాలకు అనుగుణంగా అన్ని గ్రంథాలయాల్లో వౌలిక సౌకర్యాలు కల్పిస్తామని పరిషత్ చైర్మన్ తెలిపారు. పరిశోధకులకు, విద్యార్థులకు, పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు, తదితరాలను అందుబాటులో ఉంచుతామన్నారు. కోచింగ్ కేంద్రాలు స్టడీ మెటీరియల్ ఇస్తున్నప్పటికీ, సబ్జెక్ట్ నాలెడ్జి పెంపొందించుకునేందుకు సంబంధిత అంశంపై అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే యువతకు తగిన గైడెన్స్ ఇచ్చేందుకు వీలుగా కౌన్సిలింగ్ కేంద్రాలుగా వీటిని మారుస్తామన్నారు.
వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు తదితర ఏ రంగమైనా ఉన్నత ఆలోచనలు, భావాలున్న యువత వల్ల వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. మేధావులు, విద్యావంతులు, జర్నలిస్టులు, గ్రంథాలయ ఉద్యమకారులు తదితరులతో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసి, వారి సూచనలను, సలహాలను తీసుకుంటానని శ్రీధర్ తెలిపారు. అందరి సలహాలు తీసుకుని గ్రంథాలయాలను ఏ విధంగా రూపుదిద్దాలో ఆలోచించి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామన్నారు. దేశ, విదేశాల్లో గ్రంథాలయాల పనితీరు ఎలా ఉందో కూడా పరిశీలించి, మంచి ఉంటే స్వీకరిస్తామన్నారు. విదేశాల్లో వివిధ స్థాయిలలో ఉన్న తెలంగాణ వారు గ్రంథాలయాల అభివృద్ధికి సహకరిస్తామని ముందుకు వస్తున్నారని, అలాంటి వారి సహకారం తీసుకుంటామని తెలిపారు. ఈ బడ్జెట్‌లో గ్రంథాలయ పరిషత్‌కు అవసరమైన నిధులు సమకూర్చుకుంటామని, నాన్‌ప్లాన్‌తో పాటు ప్లాన్ అవసరాలకు కూడా నిధులు వచ్చేలా చూస్తానని పేర్కొన్నారు. గ్రంథాలయాల్లో ఖాళీల భర్తీపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామని శ్రీధర్ తెలిపారు.