తెలంగాణ

ఆయుష్ కమిషనర్ హోదాలో మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణ ‘ఆయుష్’ (్భరతీయ వైద్య విధానాల డైరెక్టరేట్/కమిషనరేట్) కమిషనర్ పోస్టును డైరెక్టర్ గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా ఆయుష్ కమిషనర్‌గా ఐఎఎస్ అధికారిని నియమిస్తూ ఉంటారు. సమైక్య రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుండి ఐఎఎస్ అధికారినే కమిషనర్‌గా నియమిస్తున్నారు. మొట్టమొదటి సారి ఆయుష్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎ. రాజేందర్‌రెడ్డికి కమిషనర్‌గా ప్రమోషన్ ఇస్తూ, ఈ పోస్టులో ఏడాది కింద నియమించారు. అప్పటి నుండి ఆయుష్ కమిషనర్/డైరెక్టర్‌గా ఆయన కొనసాగుతూ వస్తున్నారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ పోస్టును డైరెక్టర్‌గానే వ్యవహరించాలని నిర్ణయించారు. రాజేందర్‌రెడ్డిని ప్రస్తుత పోస్టులో కొనసాగిస్తూనే, పోస్టును మాత్రం కమిషనర్ బదులు డైరెక్టర్‌గా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పేరుతో గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.