తెలంగాణ

1500 కిలోమీటర్లు.. 15 హైవేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక బృహత్ ప్రణాళికను కేంద్రం ముందు ఉంచింది. 1500 కిలోమీటర్ల పొడవున్న మొత్తం 15 రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హైదరాబాద్-కరీంనగర్-రామగుండం (235 కిలోమీటర్లు), నార్కట్‌పల్లి-మిర్యాలగూడ-వాడపల్లి (60 కి.మీ), జడ్చర్ల-వనపర్తి-పెబ్బేరు (74 కి.మీ) రోడ్లను జాతీయ రోడ్లుగా గుర్తించాలని ప్రతిపాదించారు. అలాగే మహబూబ్‌నగర్-నాగర్‌కర్నూలు-మన్ననూర్ (83 కి.మీ), ఎర్రవల్లి-గద్వాల-రాయచూరు (55 కి.మీ), మనె్నగూడ-వికారాబాద్-సదాశివపేట (47 కి.మీ), నల్లగొండ-మల్లేపల్లి (55 కి.మీ), జగిత్యాల-్ధర్మారం-పెద్దపల్లి-మంథని-కాటారం (132 కి.మీ), జహీరాబాద్-తాండూరు-చించోలి (70 కి.మీ) రోడ్లను కూడా జాతీయ రోడ్లుగా గుర్తించాలని ప్రతిపాదించారు. వీటితో పాటు కరీంనగర్-రాయపట్నం (50 కి.మీ), వరంగల్-నర్సంపేట-పాకాల-ఇల్లందు (85 కి.మీ), గుడిహత్నూర-ఉట్నూరు-కేరిమేరి-ఆసిఫాబాద్ (105కి.మీ), రామగుండం-మంథని- చిట్యాల- రేగొండ-జాకారం (130 కి.మీ), జగ్గయ్యపేట-బోనకల్-వైర-తల్లాడ-ఏనుకూరు-ఇల్లెందు-కొత్తగూడెం (150 కి.మీ), ఇల్లెందు-గుండాల-పినపాక (60 కి.మీ) రోడ్లను కూడా జాతీయ రహదారులుగా గుర్తించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర జాతీయ రహదారుల శాఖకు పంపించారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర అధికారులు కేంద్ర అధికారులతో సమావేశమై చర్చించారు. రాష్ట్ర ఆర్ అండ్ బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరితో సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 5,399 కిలోమీటర్ల రోడ్లు జాతీయ రహదారులుగా గుర్తింపు పొందాయి. వీటిని ఆధునిక అవసరాలకు అనుగుణంగా విస్తిరిస్తున్నారు. జాతీయ రోడ్లుగా గుర్తింపు లభించిన రోడ్లకు కేంద్రం అవసరమైన నిధులు విడుదల చేస్తుంది.