తెలంగాణ

ఆరోగ్య తెలంగాణకై సిఎం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 2 : పేదలకు వైద్యులు సేవా నిరతితో వైద్య సేవలు అందించాలని.. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా ఐఎంఎ సమావేశ మందిరంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో గర్భిణులకు డెలివరీ నుండి పుట్టిన పాప ఐదేళ్ల వరకు ఆరోగ్య సంరక్షణ - పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టేలా ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ట్యాబ్‌ల వినియోగంపై రెండురోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో కలసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో 180 ఎఎన్‌ఎంలకు 90 మందికి ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎఎన్‌ఎంలకు ట్యాబ్స్ పంపిణీ చేసిన మూడవ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సిద్దిపేట జిల్లాలో ఎఎన్‌ఎంలకు ట్యాబ్స్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే అనవసర ఆపరేషన్లు, డబ్బులు ఖర్చవుతాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో ఎఎన్‌ఎంలు 18 రకాల రిజిస్టర్లు నిర్వహించేవారని, కానీ ఇప్పుడు పేద ప్రజల ఆరోగ్యం సంరక్షించేలా సులభతరమైన సేవలు అందించేలా 18 రకాల రిజిస్ట్రేషన్లు సేవలను ట్యాబ్‌లో రూపొందించవచ్చని వివరించారు. ఇందుకోసం రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అన్నింటా సిద్దిపేట ముందంజలో ఉందని, ఆరోగ్యం అందించటంలో ముందుంటామన్నారు.