తెలంగాణ

కెసిఆర్‌ను రాళ్లతో కొడ్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 2: ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో సిఎం కెసిఆర్ ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ధి నినాదాలతో తమ్మినేటి చేపట్టిన పాదయాత్ర గురువారం ఉదయం సూర్యాపేట జిల్లా సరిహద్దుల నుండి టేకుమట్ల బ్రిడ్జి మీదుగా నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించింది. కేతేపల్లి, కొర్లపహడ్, ఇనుపాముల, నకిరేకల్, చందుపట్ల మీదుగా పాదయాత్ర మర్రూర్‌కు చేరుకుంది.
పాదయాత్రకు సిపిఎం, అనుబంధ సంఘాలు, పలు ప్రజా సంఘాల శ్రేణులు కోలాటాలు, బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికారు. గీత, చేనేత, మత్స్య తదితర వృత్తిదారులు తమ వృత్తిపరికరాల ప్రదర్శనలతో పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రకు టిడిపి, కాంగ్రెస్ శ్రేణులు సంఘీభావం తెలిపాయి. కేతెపల్లి, నకిరేకల్‌లలో నిర్వహించిన పాదయాత్ర సభల్లో తమ్మినేని వీరభద్రం ప్రసంగిస్తూ కెసిఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సిపిఎం మహాజన పాదయాత్ర ప్రారంభం సందర్భంగా గ్రామాల్లో తమను ప్రజలు రాళ్లతో కొడుతారంటూ కెసిఆర్ బెదిరించారన్నారు. కెసిఆర్ మాటలకు విరుద్ధంగా తమ పాదయాత్ర సాగిన గ్రామాల్లో ప్రజలు పూలతో స్వాగతం పలుకుతూ తమ సమస్యలను నివేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెంది ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ముచేసి నియంత పాలన సాగిస్తున్న కెసిఆర్‌నే ప్రజలు రాళ్లతో కొట్టే రోజు దగ్గర్లో ఉందన్నారు. మిగిలిన రెండేళ్ల పాలన కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు కెసిఆర్‌ను గద్దె దించుతారన్నారు. ఇంటికో ఉద్యోగంతో లక్ష ఉద్యోగాలిస్తామంటూ పేదలకు డబుల్ బెడ్‌రూమ్‌లు కట్టిస్తామని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన కెసిఆర్ వాటన్నింటినీ విస్మరించారన్నారు. మైనార్టీ, గిరిజన రిజర్వేషన్ల హామీలు, ఎస్సీ, ఎస్టీ, బిసి సబ్ ప్లాన్ అమలు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని కదిలించేందుకు సామాజిక తెలంగాణ సాధనకు పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించే పొలికేక బహిరంగ సభకు ఇంటికొక్కరు చొప్పున తరలిరావాలని కోరారు. ఈ పాదయాత్ర సభల్లో సిపిఎం కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ముల్కలపల్లి రాములు తదితరులు పాల్గొన్నారు.