తెలంగాణ

అధికారుల అలసత్వంపై అసెంబ్లీ పిఎసి గరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: ‘మీ నిర్వాకం, అలసత్వం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది, కోర్టుల్లో ఉన్న మొండి కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయడం లేదు..’ అని అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) పర్యాటక, టిఎస్‌ఐఐసి శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాలులో పిఎసి చైర్‌పర్సన్ డాక్టర్ జె గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, హనుమంతు షిండే (ఎమ్మెల్యేలు), ఫారూఖ్ హుస్సేన్, రాములు నాయక్ (ఎమ్మెల్సీలు) పాల్గొన్నారు. తొలుత శిల్పారామంలోని ప్రభుత్వ స్థలంలో 2005 సంవత్సరంలో హోటల్ నిర్మాణానికి అపికో డెవలపర్‌కు లీజుకు ఇవ్వడంలో జరిగిన అవకతవకలపై సభ్యులు సంబంధిత అధికారులను నిలదీశారు. 33 సంవత్సరాల లీజుకు ఇచ్చినప్పుడు చదరపు గజాన్ని 4 వేల రూపాయల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారని, 2007 సంవత్సరంలో 7,500 రూపాయలకు పెరిగిన ధరను లీజు ఒప్పందంలో చేర్చలేదని, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి 29.36 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, కారణమేమిటంటూ కమిటీ సభ్యులు అధికారులను ప్రశ్నించారు. అందుకు అధికారులు స్పందిస్తూ మానవ తప్పిదం వల్ల జరిగిందని, తాము డెవలపర్‌కు నోటీసు ఇచ్చిన తర్వాత సదరు డెవలపర్ కోర్టుకు వెళ్ళడం జరిగిందన్నారు. అందుకు సభ్యులు స్పందిస్తూ నిరుడు జూన్‌లో జరిగిన పిఎసి సమావేశంలోనూ ఇదే మాట చెప్పారని, కోర్టుకు వెళితే దానిపై అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడి వేగంగా కేసు పరిష్కారం అయ్యేలా చూడాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. గచ్చిబౌలిలో 2002 సంవత్సరం ఫిబ్రవరిలో గేమ్స్ విలేజ్ నిర్మాణానికి ఆహ్వానించిన టెండర్ల ప్రక్రియపై ఆడిట్ చేసిన వ్యాఖ్యలపైనా పిఎసి సభ్యులు ప్రశ్నించారు. 50 ఎకరాలను శాప్ 29 లక్షలకు కట్టబెట్టడం, ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు అమలులో జాప్యం చేయడం వంటి అంశాలపైనా వారు నిలదీశారు. అనుచిత సహాయం చేసినట్లు ఎజి తప్పుపట్టడాన్ని కమిటీ సభ్యులు ప్రశ్నించారు. 5.54 కోట్లు ఎఫ్‌డిగా, బ్యాంకు గ్యారంటీగా 9 కోట్లు ఇచ్చామని, ప్రభుత్వానికి మాట రావద్దన్న ఉద్దేశ్యంతో 13 లక్షల ఎస్‌ఎఫ్‌టి వేగవంతంగా నిర్మాణం చేసి ఇచ్చామని, ఇందులో అనుచిత సహాయం ఏమీ లేదని అధికారులు వివరించారు. స్పోర్ట్ హాస్టల్ నిర్మాణం, నిరుపయోగంగా ఉన్న గదులను ఏ విధంగా ఉపయోగిస్తారో వచ్చే సమావేశంలో తెలియజేయాలని వారు అధికారులను ఆదేశించారు.