తెలంగాణ

సొంత మొక్కులకు సిజిఎఫ్ నిధులేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నుండి ‘మొక్కుల డబ్బులు’ రికవరీ చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలంటూ సామాజిక కార్యకర్తలు కంచె ఐలయ్య, జి. రాములు హైకోర్టులో శుక్రవారం ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొక్కులు చెల్లించుకుంటానని కె. చంద్రశేఖరరావు తిరుమల, వరంగల్ తదితర ప్రాంతాల దేవాలయాల్లో మొక్కుకున్నారని ప్రచారం జరిగిందని గుర్తు చేశారు. తిరుమల వెంకటేశ్వరస్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవారు, వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారు, కురవి మల్లన్న తదితర దేవుళ్లకు సిజిఎఫ్ నిధులతో కెసిఆర్ బంగారు ఆభరణాలు చేయించారని ఐలయ్య, రాములు తెలిపారు. కెసిఆర్ మొక్కులు తీర్చేందుకు ప్రజల సొమ్ము ఉపయోగించారని, కామన్ గుడ్‌ఫండ్ (సిజిఎఫ్) నిధులను వాడుకున్నారని కోర్టుకు తెలిపారు. సిజిఎఫ్ నిధులను సొంత మొక్కుల కోసం కెసిఆర్ వినియోగించడం సరికాదన్నారు. సిజిఎఫ్ నిధుల వినియోగం కోసం నియమావళి ఉందని, ఈ నియమావళికి లోబడే నిధులను వాడాలని గుర్తు చేశారు. కెసిఆర్ మొక్కుల కోసం జారీ చేసిన జీఓలను కొట్టివేయాలని, ఈ మేరకు డబ్బును కెసిఆర్ నుండి రాబట్టేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ పిల్‌లో వారు కోరారు.