తెలంగాణ

ఆరు నెలల్లో ఐదుగురు ఆత్మహత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక, పని ఒత్తిడితో యువ ఎస్‌ఐలు, పోలీసులు సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని తనువు చాలిస్తున్నారు. ఆరు నెలల్లో ఐదుగురు పోలీసులు ఆత్మహత్య చేసుకోవడం పోలీసు శాఖను, పోలీసుల కుటుంబాలను కలవరపరుస్తున్నది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సొంత జిల్లా (పాత మెదక్)లోనే మూడు సంఘటనలు జరిగాయి. తాజాగా కరీంనగర్‌లో ఒకటి, ఆదిలాబాద్‌లో రెండు ఘటనలు జరిగాయి. సిద్దిపేట, దుబ్బాక పోలీసు స్టేషన్లో ఎస్‌ఐగా పని చేస్తున్న చిట్టిబాబు శుక్రవారం మధ్యాహ్నం తన ఇంట్లో సర్వీసు రివాల్వర్‌తో భార్య సరోజ కణతపై కాల్చి, ఆ తర్వాత తానూ తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. గత ఏడాది ఆగస్టు 17న సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కుకునూరుపల్లి ఎస్‌ఐగా పని చేస్తున్న రామకృష్ణారెడ్డి సర్వీసు రివాల్వర్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు నాటి సిద్దిపేట డిఎస్‌పి శ్రీ్ధర్, మరో ఇద్దరు సిఐలు వెంకటయ్య, రామాంజనేయుడులు కారణమని మరణవాంగ్మూలంలో తెలిపాడు. ఈ ఏడాది జనవరి 29న హుస్నాబాద్ సిఐ భూమయ్య మీడియాతో మాట్లాడుతూ డిఎస్‌పి శివకుమార్ తనను వేధిస్తున్నాడంటూ ఆరోపించారు. ఈ వివాదం సద్దుమణగక ముందే దుబ్బాక సిఐ చిట్టిబాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిట్టిబాబుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పోలీసు స్టేషన్ నుంచి సబ్-డివిజన్ క్రైమ్ పార్టీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు శివకుమార్ తెలిపారు. కాగా బదిలీ కాకుండా సస్పెండ్ చేశారన్న అనుమానం, అవమానంతో భార్యను రివాల్వర్‌తో కాల్చడంతో పాటు తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నగరంలో ప్రధాని విధులకు వచ్చి..
ఇలాఉండగా గత ఏడాది ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో ప్రధాని పాల్గొన్న బహిరంగ సభ బందోబస్తుకు ఆసిఫాబాద్ (కొమురం భీం) చింతల మానేపల్లి పోలీసు స్టేషన్ నుంచి వచ్చిన ఎస్‌ఐ శ్రీ్ధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహం కాని శ్రీ్ధర్ ఆత్మహత్యకు కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. మరో ఘటనలో ఆదిలాబాద్ జిల్లా కెరిమెరి పోలీసు స్టేషన్ ఎస్‌ఐ శ్రీ్ధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు కూలీ కుటుంబం నుంచి ఎస్‌ఐగా ఉద్యోగం సంపాదించిన శ్రీ్ధర్ వివాహం కాకుండానే చిన్న వయస్సులో తనువు చాలించడం పోలీసులను, బంధు, మిత్రులను కలిచి వేసింది. స్థానిక సిఐ వేధింపుల కారణంగానే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కరీంనగర్, పెద్దపల్లి చొప్పదండి పోలీసు స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ జగన్‌మోహన్ నాలుగు నెలల క్రితం పోలీసు ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా పోలీసులు, యువ ఎస్‌ఐలు ఆత్మహత్యలకు పాల్పడుతుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా, ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు మరణ వాంగ్మూలంలో, లేఖలో పేర్కొనడం గమనార్హం.