తెలంగాణ

ఎంబిసి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: వెనుకబడిన తరగతుల (బిసి)లో అత్యంత వెనుకబడిన కులాల (ఎంబిసి) ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలుపుతూ శుక్రవారం ఫైల్‌పై సంతకం చేశారు. వెనుకబడిన తరగుల కోసం ఇప్పటికే బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండగా అదనంగా ఈ వర్గాలలోని అత్యంత వెనుకబడిన వర్గాల కోసం ఆర్థిక సహకార సంస్థను (మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ కార్పొరేషన్) ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. వెనుకబడిన తరగతులలో అత్యంత వెనుకబడిన కులాల వారి వృత్తులకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించడానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్టు ఈ వర్గాలతో ఇటీవల జనహితలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు కొత్త కార్పొరేషన్ ఏర్పాటు ఫైల్‌పై సంతకం చేశారు.