తెలంగాణ

75% సబ్సిడీతో పందుల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: దేశంలో తొలి సారిగా 75శాతం సబ్సిడీతో ఎరుకల వారికి పందులను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో లక్షా 20వేల ఎరుకల కుటుంబాలు ఉన్నాయి. వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం సబ్సిడీతో పందులను ఇవ్వాలని నిర్ణయించినట్టు పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
సంక్షేమ పథకాలపై సచివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులో తలసాని మాట్లాడారు. 75వేల రూపాయల విలువైన యూనిట్‌ను 75శాతం సబ్సిడీపై ఐదు ఆడ పందులు, ఒక మగ పందిని అందించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఎన్‌సిడిసి నిధుల ద్వారా లేదా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. పందుల పెంపకంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తూ శాస్ర్తియ విధానంలోనే పందుల పెంపకాన్ని ప్రోత్సహించనున్నట్టు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి పంది మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసే విధంగా ఎరుకల కులస్తులకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ తదితర దేశాల్లో పందుల పెంపకం ప్రధాన వృత్తిగా ఉందని మంత్రి చెప్పారు. గతంలో ఎప్పుడూ తమ కుల వృత్తి గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, తమ గురించి ప్రభుత్వం పట్టించుకుని సబ్సిడీతో పందులను ఇవ్వాలని ఆలోచించడం పట్ల సమావేశంలో పలువురు ఎరుకల సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. పందుల పెంపకంపై ఆధారపడిన ప్రతి ఒక్కరూ రెండు నెలల్లో సొసైటీలు ఏర్పాటు చేసుకోవాలని తలసాని చెప్పారు.