తెలంగాణ

సుధీర్ కమిటీ నివేదికను అమలుపర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మార్చి 3: విద్యా, ఆర్థిక, సామాజిక రంగాల్లో వెనుకబడిన ముస్లింల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలని, ముస్లిం మైనార్టీల స్థితిగతులపై సుధీర్ కమిటి ఇచ్చిన నివేధికను తక్షణమే అమ లు చేయాలని టి-జెఎసి చైర్మన్ కోదండ రాం డిమాండ్ చేసారు. శుక్రవారం సంగారెడ్డిలోని ఇస్లామిక్ స్టడీ సెంటర్‌లో సుధీర్ కమిటి ఇచ్చిన నివేధికపై ఏర్పాటు చేసిన సదస్సుకు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముస్లింల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నియమించిన సుధీర్ కమిటి 12 అంశాలపై సమగ్రమైన నివేధికను అందజేసిందని, ఆ నివేధికను ప్రభుత్వం పరిశీలించి అమలు చేయాలని కోరా రు. 12 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయడమే కాకుండా 4శాతం రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న కేసులో పురోగతి సాధించేలా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. సుధీర్ కమిటి నివేధికను అమలు చేసే లా ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తామన్నారు. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చ జరిగేలా జెఎసి తనవంతు కృషి చేస్తుందన్నారు. ముస్లింల అభివృద్ధి కోసం గతంలో కూడా అనేక కమిటీలను వేసారని, ఆయా కమిటీలు సమర్పించిన నివేధికలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసారని, దీంతో ఆయా కమిటిలు ఉనికిని కోల్పోయాయన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుధీర్ కమిటి కూడా గత కమిటీల అనుభవం కలుగకుండా ప్రభు త్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ప్రజాసమస్యలపై పోరాటం చేయడంలో జెఎసి ముందువరుసలో నిలుస్తుందన్నారు. టిజెఎసి ఎందులోను తక్కు వ కాదని పేర్కొన్నారు. పిట్టల రవీందర్ వ్యవహారంపై స్టీరింగ్ కమిటిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టిజెఎసి రాష్టన్రాయకులు పురుషోత్తం, జెఎసి నాయకులు అశోక్‌కుమార్, బీరయ్య యాదవ్, రమేష్, విద్యార్థి జెఎసి నాయకులు సలీం, ఎంపిజె రాష్ట్ర అధ్యక్షులు ఖాజామైనోద్దీన్, అన్వర్, ఆదిల్ మహ్మాద్ తదితరులు పాల్గొన్నారు.