తెలంగాణ

లక్ష్యంతో పతకాలు సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 3: క్రీడలలో విజయం సాధించాలి, పతకాలు సాధించాలనే లక్ష్యంతో క్రీడాకారులు పోటీలలో పాల్గొనాలని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ అనురాగ్‌శర్మ సూచించారు. ఒకసారి పాల్గొన్న పోటీలలో విజయం సాధించకున్నా తదుపరి పోటలలో విజేత కావాలనే పట్టుదల క్రీడాకారులలో పెరగాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్టస్థ్రాయి రెండవ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌ను శుక్రవారం సాయంత్రం డిజిపి అనురాగ్‌శర్మ నగరంలోని జవహర్‌లాల్ నెహ్రు స్టేడియంలో ప్రారంభించారు. క్రీడల ప్రారంభ సూచకంగా క్రీడాజ్యోతిని వెలిగించి పావురాలను, బెలూన్లను ఎగురవేసారు. క్రీడలలో పాల్గొంటున్న వివిధ పోలీసు విభాగాల, రేంజ్‌ల క్రీడాకారుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు క్రీడాకారులను ఉద్ధేశించి ఆయన మాట్లాడుతు పోటీలు కఠినంగా ఉండవచ్చని, కానీ గెలుపు ధ్యేయంగా క్రీడాకారులు కృషి చేయాలని చెప్పారు. ఐదురోజుల పాటు జరిగే రాష్టస్థ్రాయి పోలీసు క్రీడలలో పాల్గొంటున్న పోలీసు క్రీడాకారులు ఆటలలో గెలవాలనే ఆలోచన తప్ప మరే విషయాన్ని ఆలోచించ కూడదని తెలిపారు. క్రీడలు పోలీసులలో మానిసిక ఉల్లాసం కలిగించటం ద్వారా విధి నిర్వహణలో మరింత స్ఫూర్తి కలిగిస్తుందని అన్నారు. పోలీసుల సమస్యలను పరిష్కరించేందుకు, పోలీసు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. క్రీడల ప్రారంభ సూచికగా 800మీటర్ల స్ర్తి, పురుషుల పరుగుపందెంను డిజిపి ప్రారంభించారు. ఈ రెండు పోటీలలో వరంగల్ క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. మహిళల విభాగం 800మీటర్ల పరుగుపందెంలో వరంగల్ పోలీసు కమీషనరేట్‌కు క్రీడాకారిణి సుజాత విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో పోలీసు క్రీడా విభాగం ఇన్‌చార్జ్ అదనపు డిజి వివి శ్రీనివాసరావు, నార్తల్ జోన్ ఐజి నాగిరెడ్డి, వరంగల్ రేంజ్ డిఐజి రవివర్మ, నగర పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు, భద్రాద్రి జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, వరంగల్ రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వరంగల్ రేంజ్ జైళ్ల శాఖ డిఐజి కేశవనాయుడు, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి పాల్గొన్నారు.