తెలంగాణ

పదవీకాలం పొడిగింపు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: పదవీవిరమణ చేసే దశలో నచ్చిన వారికి పదవీకాలాన్ని పొడిగించుకుంటూ పోతే పదవీవిరమణకు దగ్గరపడిన వారికి పదోన్నతుల సంగతి ఏమిటని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీరును బిజెపి నిలదీసింది. రిటైర్డు ఉన్నతాధికారులను సలహాదారులుగా నియమించడం, పదవీకాలాన్ని పొడిగించడం కారణంగా మిగిలిన వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొందని బిజెపి ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి పేర్కోన్నారు. ఎంతో అనుభవం అన్న అధికారులు ఉండగా, ఆయా ప్రభుత్వ శాఖల్లో సలహాదారులుగా రిటైర్డు అధికారులను నియమించడంలో అర్ధం లేదని, అధికారుల పదవీకాలాన్ని పెంచడం అంటే సర్వీసులో ఉన్న అధికారులకు దక్కాల్సిన ప్రమోషన్ నిరాకరించడమేనని అన్నారు.
అదే విధంగా నీటిపారుదల, ఆర్ అండ్ బి శాఖల్లో చీఫ్ ఇంజనీర్ల పదవీకాలాన్ని పొడిగించడంతో ఇంజనీర్లు కూడా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారని , ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని అన్నారు. ఇంత వరకూ తెలంగాణలో 8 మంది ఐఎఎస్‌లు, నలుగురు ఐపిఎస్‌లను సలహాదారులుగా, వివిధ పదవుల్లో నియమించారని గుర్తుచేశారు. దీనివల్ల పరిపాలనలో అనేక ఇబ్బందులు ఎదురవడంతో పాటు నిర్ణయాలు, విధానాలు అమలుచేయడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని సలహాదారులు, ప్రిన్సిపల్ సెక్రటరీల మధ్య అధికార పెత్తనం కోసం ఘర్షణ జరుగుతోందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ పద్ధతులకు స్వస్తి చెప్పి, సర్వీసు ఉన్న అధికారులు, ఇంజనీర్లు సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు.