ఆంధ్రప్రదేశ్‌

2019 నాటికి పోలవరం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, మార్చి 5: దేశ, విదేశీ కంపెనీల సహకారంతో 2019 నాటికల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయాలనే సంకల్పంతో ప్రణాళికాబద్ధంగా పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి సోమవారం నిర్మాణ పనులు పరిశీలించి వేగంగా జరగడానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇక నుండి తాను ప్రతి ఆదివారం ఇక్కడకు వచ్చి పనులు పరిశీలించి, నిర్మాణ పనులపై సమీక్ష జరుపుతానన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆదివారం మంత్రి దేవినేని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు అథార్టీ డైరెక్టర్ సెక్రటరీ ఆర్‌కె గుప్తా ఇక్కడే ఉండి పనులు సమీక్షిస్తారని తెలిపారు. సిడబ్ల్యూసి అధికారులు డిజైన్‌కు సంబంధించిన అనుమతులిస్తూ పనులు వేగంగా జరగడానికి దోహదపడుతున్నారన్నారు. త్వరలో విదేశాల నుండి వస్తున్న అధునాతన యంత్రాలు పనుల్లో పాలుపంచుకుంటాయన్నారు. స్పిల్‌వేలో కాంక్రీటు పనులు వేగంగా జరుగుతున్నాయని, వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలో కాంక్రీటు పనులు చేస్తే బీటలు వచ్చే అవకాశం ఉన్నందున 8 నుండి 15 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రతలో స్పిల్‌వే నిర్మాణ ప్రాంతాన్ని నియంత్రణలో ఉంచి కాంక్రీటు వేస్తామన్నారు. రోజుకు స్పిల్ ఛానల్‌లో 1.5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో ప్లాస్టిక్ వాల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి శాస్తవ్రేత్తలు రాయి పరీక్షలు నిర్వహించి, అవసరమైన అనుమతులు ఇస్తున్నారని మంత్రి తెలిపారు. సిబ్బంది నివాస గృహాలు, కార్యాలయాలు నిర్మాణాలు పూర్తయ్యాయని, వాటితోపాటు పోలవరం ప్రాజెక్టు అధార్టీ కార్యాలయం నిర్మాణం కూడా పూర్తయిందన్నారు. ఇఎన్‌సి, ఎస్‌ఇ స్థాయి నుండి దిగువ స్థాయి సిబ్బంది వరకూ ఇక్కడే ఉంటారన్నారు. ఈ నెల 15వ తేదీ తర్వాత కాపర్ డ్యామ్ పనులు సిఎం పర్యవేక్షిస్తారని, కాపర్ డ్యామ్ 2018 నాటికి పూర్తిచేసి గ్రావిటీ ద్వారా కాలువలకు నీరు తరలిస్తామన్నారు. కుడి కాలువ వద్ద తమ్మిలేరు, రామిలేరు అక్విడెక్టు పనులు మే నెల నాటికి పూర్తవుతాయని, దాంతో కుడి కాలువ నిర్మాణం పూర్తయినట్లవుతుందన్నారు. ఈ సీజన్లో పట్టిసం ఎత్తిపోతల పథకం ద్వారా 80 నుండి 90 టిఎంసిల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తామన్నారు. అలాగే కుడి కాలువ నుండి రెవెన్యూ పరిధిలోని కొత్తూరు చెరువుకు నీటిని తరలించడానికి ఛానల్ నిర్మాణం కూడా మే నాటికి పూర్తిచేస్తామన్నారు. మంత్రి స్పిల్‌వే నిర్మాణ పనులను, డయా ఫ్రమ్ వాల్ వద్ద ప్లాస్టిక్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై అధికారులు, కాంట్రాక్టు ఏజన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి వెంట ఇఎన్‌సి వెంకటేశ్వరరావు, ఎస్‌ఇ సిఎస్ రమేష్‌బాబు, ప్రాజెక్టు ప్రతినిధులు సాంబశివరావు తదితరులున్నారు.

స్పిల్‌వే కాంక్రీటు పనులు పరిశీలిస్తున్న మంత్రి దేవినేని