తెలంగాణ

వచ్చే ఏడు మరో 119 గురుకులాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 6: కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా బిసి గురుకుల విద్యాలయాలను తీర్చి దిద్దనున్నట్టు బిసి సంక్షేమ, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సచివాలయంలో వెనుకబడిన తరగతుల విద్యాలయాల సంస్థ పాలక మండలి సమావేశంలో జోగు రామన్న మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో 119 బిసి గురుకులాలు ప్రారంభం అవుతాయని చెప్పారు. అత్యాధునిక భవనాలను నిర్మించడంతో పాటు నాణ్యమైన విద్య విద్యార్థులకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
బిసి గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు యూనిఫాంలు, బూట్లు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, కాస్మొటిక్స్‌ను ఉచితంగా అందజేయనున్నట్టు జోగు రామన్న తెలిపారు. ఈ గురుకులాల్లో పోస్టుల భర్తీకి చర్య తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వేసవి సెలవుల్లో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహించాలని ఈ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఇప్పటికే 16 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసినట్టు చెప్పారు.

చిత్రం..సచివాలయంలో సోమవారం వెనుకబడిన తరగతుల
విద్యాలయాల సంస్థ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న మంత్రి జోగురామన్న