తెలంగాణ

మదర్సాల నిధులు గోల్‌మాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 6: తెలంగాణలోని మదర్సాల నిధుల గోల్‌మాల్‌పై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మహబూబ్‌నగర్‌లో డిఇవోగా ఉన్న సమయంలో సోమిరెడ్డి నకిలీ మదర్సాలకు నిధులు కేటాయించారంటూ వచ్చిన అభియోగాలపై సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలోని 32 మదర్సాలు ఉండగా వీటిలో 16 మదర్సాలకు 2014-15 విద్యాసంవత్సరానికి గాను రూ. 50 లక్షలు, 2015-16 సంవత్సరానికి రూ. 20 లక్షల నిధులు మంజూరయ్యాయి. వీటి వినియోగానికి సంబంధించిన అభియోగాలపై డిఇవో సోమిరెడ్డిని సిసిఎస్ పోలీసులు ప్రశ్నించారు. కాగా నిధుల దుర్వినియోగంపై గతంలో విచారణ కమిటీ నివేదిక ఇచ్చానని, మరోసారి మదర్సాల నిధుల మంజూరుపై లిఖితపూర్వకంగా నివేదిక ఇస్తానని సోమిరెడ్డి సిసిఎస్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఇదిలావుండగా నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలతోపాటు నిజామాబాద్ జిల్లాల్లో కూడా మదర్సాల నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు జరుగుతుందని సిసిఎస్ పోలీసులు తెలిపారు.