తెలంగాణ

వికలాంగుడిని చితకబాదిన ఎస్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 7: సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనం విషయం పై కేసు నమోదు చేయకపోవడంతో నిలదీసిన ఒక వికలాంగుడిని ఎస్‌ఐ చితకబాదాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు మండలం మామిడ్యాలకు చెందిన బల్ల లక్ష్మణ్ వికలాంగుడు. గతనెల 23న తన నాన్నమ్మ ఇంట్లో దొంగలు పడి బంగారు నగలు చోరీ అయ్యాయ. చోరీకి పాల్పడ్డ అనుమానితుల వ్యక్తుల పేర్లతో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా స్వీకరించేందుకు ఎస్‌ఐ నిరాకరించాడు. దీంతో లక్ష్మణ్ గజ్వేల్ ఏసిపి దృష్టికి తీసుకువెళ్లినా ఎస్‌ఐ ఫిర్యాదు స్వీకరించలేదు. దీంతో మంగళవారం తన కుటుంబ సభ్యులతో ఎస్‌ఐ శ్రీశైలం వద్దకు వెళ్లి ఎందుకు ఫిర్యాదు తీసుకోవడం లేదని నిలదీయడంతో అతనిని ఎస్‌ఐ, పోలీసులు చితకబాదారు. ఈ విషయాన్ని బాధితుడు మీడియా ముందు వెళ్లబోసుకున్నాడు. ఈ విషయం పై సిద్దిపేట సిపి శివకుమార్‌ను వివరణ కోరగా బాధితుడు లక్ష్మణ్ పోలీసుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లే ఎస్‌ఐ శ్రీశైలం మందలించాడన్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. బాధితుడు ఎస్‌ఐపై చేసిన వ్యాఖ్యలు సిసి కెమెరాలో రికార్డయ్యాయన్నారు.

చిత్రం..ఎస్‌ఐ చేతిలో దెబ్బలు తిన్న వికలాంగుడు లక్ష్మణ్