తెలంగాణ

హైదరాబాద్ ఐపిఎల్ మ్యాచ్‌కు అడ్మినిస్ట్రేటర్‌ను నియమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగబోయే ఐపిఎల్ మ్యాచ్‌ల పర్యవేక్షణకు అడ్మినిస్ట్రేటర్‌ను నియమించాల్సిందిగా బిసిసిఐ హైకోర్టును కోరింది. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాల్సిందిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను ఆదేశించాల్సిందిగా నగరానికి చెందిన న్యాయవాది ఎం. గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు బిసిసిఐ తరపు న్యాయవాదిని ఆదేశించింది. ఐపిఎల్ మ్యాచ్‌ల నిర్వహణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పాత్ర ఏ మేరకు ఉంటుందో బిసిసిఐ తరపు న్యాయవాది ప్రియదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. మ్యాచ్‌ల సందర్భంగా ఒక్కో మ్యాచ్‌కు హెచ్‌సిఎకు 60 లక్షల రూపాయలు లభిస్తాయి కాబట్టి అన్ని రకాల వ్యయాన్ని ఇందులో నుంచే భరించాల్సి ఉంటుందని అన్నారు. భారత్ క్రికెట్ క్లబ్‌కు చెందిన న్యాయవాది మసూద్ ఖాన్ వాదనలు వినిపిస్తూ, హెచ్‌సిఎను ఎవరు నిర్వహిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.