తెలంగాణ

విద్యుదాఘాతాలకు 522మంది బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణలో ఏటేటా విద్యుత్ ప్రమాద మరణాలు పెరుగుతున్నాయని రాష్ట్ర సలహా సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాలతో 2015-16లో 522 మంది, 2016-17 తొలి ఆరు నెలల్లో 292 మంది మృత్యువాత పడ్డారని పేర్కొంది. విద్యుత్ పంపిణీ సంస్థల నిర్వహణ లోపాల వల్ల అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని సలహా సంఘం అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయంలో మంగళవారం సలహా సంఘం మూడో సమావేశం జరిగింది. ఈఆర్‌సి చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉత్తర, దక్షిణ డిస్కాంల సిఎండిలు జి రఘుమారెడ్డి, ఏ గోపాల్‌రావు, ట్రాన్స్‌కో జెఎండి సి శ్రీనివాసరావు, సలహా కమిటీ సభ్యులు, ఫ్యాప్సీ అధ్యక్షులు వెనె్నం అనిల్ రెడ్డి, ప్రయాస్ ఎనర్జీ సంస్థ సభ్యులు ఎన్ శ్రీకుమార్ పాల్గొన్నారు. ఎర్తింగ్ లోపాలు, నాసిరకం పరికరాలు, తక్కువ ఎత్తులో వేలాడే తీగలతో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని, మిగులు విద్యుత్ ఉండకుండా ప్రైవేట్ విద్యుత్ కొనుగోళ్లను పున:సమీక్షించాలని సంఘం సభ్యులు శ్రీకుమార్ కోరారు.
రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ సరఫరాపై కచ్చితమైన లెక్కలు తేల్చాలన్నారు. డిస్కాంలు ఇంకా టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించని నేపథ్యంలో వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రస్తుత టారిఫ్‌ను యథాతథంగా కొనసాగించాలని లేదా ఫుల్ కాస్ట్ టారిఫ్ ఉత్తర్వులు జారీ చేసే అంశాలపై సుమోటోగా నిర్ణయం తీసుకునే అధికారం ఇఆర్‌సికి ఉందని సలహా సంఘం అభిప్రాయపడింది. రాష్ట్రంలో పరిశ్రమలకు విద్యుత్ చార్జీల పెంపు హేతుబద్ధంగా ఉండాలని ఫ్యాప్సీ అధ్యక్షుడు వెన్నం అనిల్ రెడ్డి కోరారు. చార్జీల పెంపును వ్యతిరేకించడం లేదని, అయితే పరిశ్రమల స్తితిగతులను సైతం పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాదికి 9వేల కోట్ల ఆర్ధిక లోటు ఉందని డిస్కాంలు వేసిన అంచనాలపై అనుమానాలు ఉన్నాయన్నారు.