తెలంగాణ

ముగ్గురు తెరాస ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: శాసన సభ్యుల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు టిఆర్‌ఎస్ అభ్యర్థులు ముగ్గురు మంగళవారం అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. మూడు స్థానాలకు ముగ్గురి నామినేషన్లు మాత్రమే దాఖలు కావడం వల్ల వీరి ఎన్నిక లాంచనప్రాయంమైంది. మైనంపల్లి హనుమంతరావు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్‌గౌడ్‌లు నామినేషన్ దాఖలు చేశారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కె తారక రామారావు, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహ్మారెడ్డి, తలసాని యాదవ్, పద్మారావు, మండలిలో చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపిలు, ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే ఖాద్రీ కూడా టిఆర్‌ఎస్ నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి ముందు గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని ఆదరణ కెసిఆర్‌కు ఉందని అన్నారు. ఎన్నికల ప్రణాళికను కచ్చితంగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. తెలంగాణలో టిడిపి లేదని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డివి ఉత్తుత్తి మాటలని ఎద్దెవా చేశారు.
9న పోలింగ్
ఉపాధ్యాయ నియోజక వర్గానికి ఈనెల 9 న జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల అధికారి జనార్థన్‌రెడ్డి తెలిపారు. ఈ రోజు ప్రచారం ముగిసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజక వర్గాల ఓటర్లు తొమ్మిదిన జరిగే పోలింగ్‌లో ఓటు వేస్తారు. ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 23,789 మంది ఓటర్లు ఓటు వేస్తారు. మొత్తం పనె్నండు మంది రంగంలో ఉన్నారు. తొమ్మిదిన పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ఉంటుంది. మంగళవారం సాయంత్రం నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం షాపులు కూడా మూసి వేస్తారని ఎన్నికల అధికారి తెలిపారు. ఈనెల 20న ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది.