తెలంగాణ

పైపులైన్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన పైపులైన్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి ఝాను కోరారు. ఎస్‌పి సింగ్ మంగళవారం ఝాతో సమావేశమై మిషన్ భగీరథకు అటవీ శాఖ అనుమతుల గురించి చర్చించారు. ఎస్‌పి సింగ్ తన ఢిల్లీ పర్యటన రెండో రోజు సందర్భంగా పలు శాఖల కార్యదర్శులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ది పథకాల అమలు, కేంద్రం నుండి రావలసిన అనుమతులు, నిధుల గురించి చర్చించారు. ఎస్‌పి సింగ్ మొదట నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్‌ను కలిసి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న వివిధ అభివృద్ధి పథకాలకు కేంద్రం అదనపునిధులు ఇవ్వాలని సూచించారు. అనంతరం ఆయన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి అజయ్ నారాయణ్ ఝాతో సమావేశమై మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన పైపు లైన్ల నిర్మాణానికి అటవీ, పర్యావరణ అనుమతుల గురించి చర్చించారు. సింగ్ ఆ తరువాత కేంద్ర ఉన్నత విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి ఈపితా రాయ్, ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా, న్యాయ శాఖ కార్యదర్శి సురేశ్ చంద్రలను కలిసి ఆయా శాఖలకు సంబంధించిన పథకాలు, సమస్యల గురించి చర్చించారు.