తెలంగాణ

బిసి అభ్యర్థికి మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: ఉపాధ్యాయ శాసనమండలి (హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్) అభ్యర్థి ఎన్నికల్లో ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం కూడా బిసి అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వలేదని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య విమర్శించారు. మంగళవారం బిసి భవన్‌లో జరిగిన సమావేశానికి ఆర్. కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య ప్రసంగిస్తూ ఉపాధ్యాయ సంఘాలు బిసి అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వకపోవడం బిసిలను అవమానించడమేనని అవుతుందని అన్నారు. బిసి సంఘాలు బలపరిచిన ఎస్. విజయ్‌కుమార్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన ఉపాధ్యాయులను కోరారు. ఈ ఎన్నికలు ఒసిలకు బిసిలకు మధ్య జరుగుతున్న పోటీ అని ఆయన అన్నారు.