తెలంగాణ

పాఠశాల విద్య కోసం 20వేల కోట్లు కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: పాఠశాల విద్యకు రానున్న బడ్జెట్‌లో 20వేల కోట్లు కేటాయించాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను కోరినట్టు తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ, ప్రధానకార్యదర్శి ధనసిరి ప్రకాశ్‌లు పేర్కొన్నారు. అనేక విద్యావసరాలు ఉన్నాయని, ఈ క్రమంలో వాటిని తీర్చేందుకు బడ్జెట్‌లో 20వేల కోట్లు కేటాయించాలని కోరారు. ప్రీ ప్రైమరీ, ఇంటర్ క్లాసులకు 4558 కోట్లు, సాధారణ బడ్జెట్ 8574 కోట్లు, జీతాలు, ఇతర ఖర్చుల పెరుగుదలకు అదనంగా 857 కోట్లు, పాఠశాల వౌలిక వసతుల కల్పనకు 1875 కోట్లు, ప్రీ ప్రైమరీ వౌలిక సదుపాయాల కల్పనకు, ఇతర సదుపాయాలకు 4వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేశారని పేర్కొన్నారు. నిధులు ఇస్తేనే ప్రీప్రైమరీ, ఇంగ్లీషు మీడియం, ఇంటర్ క్లాసుల నిర్వహణలో పాఠశాల విద్య బలోపేతం అవుతుందని అన్నారు.