తెలంగాణ

నా కూతురిని విడిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: పాకిస్తాన్‌లో ఐదేళ్లుగా నిర్బంధంలో ఉన్న తన కూతురు మొహమ్మదీ బేగంను విడిపించాలని ఆమె తండ్రి హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అక్బర్ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. తన కూతురు మొహమ్మదీ బేగం మస్కట్, ఒమన్ దేశాల్లో పనిచేసినప్పుడు ఒమన్ దేశానికి చెందిన మహమ్మద్ యూసుఫ్‌ను పెళ్లి చేసుకుంది. అయితే యూసుఫ్ ఒమన్ దేశానికి చెందిన వాడు కాదని, పాకిస్తాన్‌కు చెందిన వాడని తేలింది. పాకిస్తాన్‌లో తన కూతురిని చెరలో ఉంచి భోజనం పెట్టకుండా, అనారోగ్యంతో ఉంటే మందులు ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ అక్బర్ కేంద్ర మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తన కూతురిని కసాయి భర్త చెర నుంచి విడిపించి స్వదేశానికి తీసుకురావాలని అక్బర్ విన్నవించారు. ఈమేరకు పరిశీలిస్తామని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ భరోసా ఇచ్చారని అక్బర్ తెలిపారు.