తెలంగాణ

మహిళా రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు బిజెపి కట్టుబడి ఉందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మహిళా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ కార్మిక శాఖలో అవినీతి నిర్మూలన కోసం కొత్త చట్టాలను తీసుకువస్తామని చెప్పారు. స్టార్ట్ అప్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు 5 లక్షల నుండి కోటి రూపాయిల వరకూ తక్కువ వడ్డీకే రుణాలను అందించనున్నట్టు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులను సైతం ఈఎస్‌ఐ పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. అందుకోసం ఆర్ధిక శాఖ అనుమతి కోరామని త్వరలో ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అదే విధంగా మహిళలకు ప్రసూతి సెలవులను కూడా పెంచామని పేర్కొన్నారు.