తెలంగాణ

పోలీసులూ హుందాగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: రాష్ట్ర శాసనమండలి, శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బందోబస్తులో ఉండే పోలీసులు మర్యాదకరంగా వ్యవహారించాలని శాసనసభ సభాపతి ఎస్.మధుసూదనాచారి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నెల 10 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం స్పీకర్‌తో పాటు మండలి చైర్మన్ స్వామిగౌడ్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా(ఇన్‌చార్జి), మండలి కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజాసదారామ్, డిజిపి అనురాగ్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ స్వామిగౌడ్, సభాపతి మధుసూదనాచారి పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. సున్నితంగా వ్యవహారిస్తే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని అన్నారు. సందర్శకుల సంఖ్య తగ్గించాలన్న అంశంపైనా చర్చ జరిగింది. ఈ విషయంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల సహకారాన్ని కూడా కోరనున్నట్లు వారు చెప్పారు.

చిత్రం..అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా మంగళవారం పోలీసు అధికారులతో సమీక్ష జరుపుతున్న స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్