తెలంగాణ

ఆటపాటల్లో మహిళా నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: పదవులు, హోదాలు పక్కన పెట్టారు. విజిల్స్ వేశారు, క్యారమ్స్ అడారు ఆట పాటలతో గడిపారు. ఎంపి, జడ్‌పి చైర్మన్‌లు, ఎమ్మెల్యేలు అందరూ ఆటపాటలతో గడిపారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం కనిపించిన దృశ్యం. మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఘనంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. మహిళా నాయకులంతా రెండు జట్లుగా విడిపోయి తాడును లాగే ఆట ఆడారు. కవిత విజిల్ ఊది ఉత్సాహ పరిచారు. కవిత విజిల్ వేస్తూ కుర్చీల ఆట ఆడించారు. క్యారమ్స్ ఆడారు. ఈ వేడుకల్లో ఎంపి కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, జడ్‌పి చైర్‌పర్సన్ తుల ఉమ, సునీతా మహేందర్‌రెడ్డి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళా నాయకులు, కార్యకర్తలు వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతనే మహిళలకు ప్రాధాన్యత పెరిగిందని కవిత అన్నారు. టిఆర్‌ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్ద పీట వేసినట్టు చెప్పారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు అన్ని రంగాల్లో మహిళలను అణగదొక్కారని, స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత లభిస్తోందని చెప్పారు. కులంతో సంబంధం లేకుండా పేదరికంలో ఉన్న అందరికీ కళ్యాణ లక్ష్మి కింద ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు చెప్పారు. దళితులకు ఇచ్చే మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మహిళల పేరు మీదనే రిజిస్టర్ చేస్తున్నట్టు చెప్పారు. మార్కెట్ కమిటీల్లో మహిళలకు అవకాశం కల్పించామని , జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించినట్టు చెప్పారు. ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న మహిళలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని చెప్పారు. వీలైనంత త్వరగా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి ప్రభుత్వానికి నామినేటెడ్ పదవులపై నివేదిక ఇస్తామని చెప్పారు. రాజకీయ అవకాశాలతో పాటు మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.

చిత్రం..మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో మంగళవారం ఎమ్మెల్యేలు, జడ్‌పి చైర్‌పర్సన్‌లు, మహిళానేతలు, కార్యకర్తలతో సెల్ఫీలు దిగుతున్న కవిత