తెలంగాణ

గరుడ వాహనంపై విహరించిన యాదగిరీశుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 7: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం తొమ్మిదవ రోజు యాదగిరీశుడు శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడవాహనంపై విహరించి భక్తులను పులకింపజేశారు. ఉదయం 10గంటలకు బాల ఆలయంలో ప్రధానార్చకులు నంధీగల్ నరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యుల ఆధ్వర్యంలో యాదగిరీశుడు పంచనారసింహుడిని మహావిష్ణువు అవతారంలో అలంకరించి ప్రియ భక్తుడైన గరుడాళ్వార్ వాహనంపై విహరింపచేశారు. అనంతరం రాత్రి 7 గంటలకు కల్యాణమూర్తులైన శ్రీ లక్ష్మీనరసింహులను ఇద్దరినీ దివ్య విమాన రథంపై ఊరేగించారు. బ్రహ్మదేవుడే సారధిగా వ్యవహరించే దివ్య విమాన రథోత్సవంలో లక్ష్మీనరసింహులను దర్శించుకున్న భక్తులు పరవశులయ్యారు. భక్తజనుల సందర్శనార్ధం కొండకింద వైకుంఠ ద్వారం నుండి స్థానిక ప్రచార రథంపై లక్ష్మీనరసింహులను ఊరేగించారు. భక్తుల గోవింద నామస్మరణలు, భజనలు, కళాకారుల ప్రదర్శనలతో ఈ రథోత్సవం సాగింది. స్వస్తివచనం పిదప స్వామి, అమ్మవార్లను ఆలయానికి చేర్చారు. వేద పారాయణ, హోమాదిపూజలు, ధార్మిక, సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. ఈ ఉత్సవాల్లో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసంహామూర్తులు పాల్గొన్నారు.
నేడు మహాపూర్ణాహుతి..చక్రతీర్థం
యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో నేడు పదవ రోజు బుధవారం ఉదయం మహాపూర్ణాహుతి, చక్రతీర్ధం, రాత్రి శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను నిర్వహించనున్నారు.

చిత్రం..యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదవ రోజు శ్రీ మహావిష్ణువు అలంకారంలో
గరుడ వాహనంపై విహరించిన శ్రీ లక్ష్మీనారసింహుడు