తెలంగాణ

అభివృద్ధికి ప్రతిబింబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: తెలంగాణలో 33 నెలల అభివృద్ధి, సంక్షేమ పాలనకు గవర్నర్ ప్రసంగం అద్దం పట్టిందని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ తెలిపారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, చింతా ప్రభాకర్‌లతో కలిసి మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగాన్ని వినకుండా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేయడం శోచనీయమని విమర్శించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభ్యులంతా కనీస మర్యాదలు, విలువలు పాటించాలని, అవాంతరాలు కలిపించ వద్దని బిఎసి సమావేశంలో నిర్ణయించినా కాంగ్రెస్ సభ్యులు పద్దతి మార్చుకోలేదని విమర్శించారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగకుండా చూడాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించుకున్నట్టు అర్ధం అవుతోందని అన్నారు. గవర్నర్ టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారారని టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని గవర్నరు చదవడం అనాదిగా వస్తున్న సంప్రదాయమేనని గత సమావేశాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. 33నెలల తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతి కార్యక్రమాలే గవర్నర్ ప్రసంగంలో చోటు చేసుకున్నాయని, ఎలాంటి అభూత కల్పనలు లేవని అన్నారు. జిఎస్‌డిపి జాతీయ స్థాయిలో 11.5శాతం ఉండగా, తెలంగాణలో 13.7శాతం ఉందని చెప్పారు. వ్యవసాయ ఆధారిత రంగాల్లో 17.2శాతం, పరిశ్రమల రంగంలో 9.8శాతం, సేవల రంగంలో 14.6శాతం వృద్ది రేటు ఉందని చెప్పారు.