తెలంగాణ

ధర్నా చౌక్ తరలింపు విరమించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: నిరసన ప్రదర్శనలకు వేదికగా ఉన్న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్దగల ధర్నాచౌక్‌ను టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎత్తివేయాలన్న ప్రతిపాదనను బిజెపి తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఖండించారు. గతంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల ముందు, ఇతర ప్రదేశాలలో నిరసన ప్రధర్శనలు నిర్వహించేవారు. ఆ తరువాత నిరసన ప్రదర్శనలు ఇందిరా పార్క్ వద్దగల ధర్నాచౌక్‌కు పరిమితం చేయడం జరిగిందని తద్వారా ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి వస్తాయని గత ప్రభుత్వాలు సూచించాయని పేర్కొన్నారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి నిరాకరిస్తూ హైదరాబాద్‌కు శివార్ల వద్ద మాత్రమే నిరసన ప్రదర్శన, ధర్నాలు నిర్వహించాలని చెప్పడం ప్రజల హక్కులను కాలరాయడమే, ప్రజల నుండి ప్రతిఘటన రాకముందే ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని, ధర్నా చౌక్ తరలింపు ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.