తెలంగాణ

నిరుపయోగ భూముల స్వాధీనం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: పరిశ్రమలు నెలకొల్పుతామని ప్రభుత్వం నుంచి భూములు తీసుకుని నిరుపయోగంగా ఉంచితే వాటిని స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ చర్యలకు ఉపక్రమించింది.
గత కొన్ని సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు హైదరాబాద్ పరిసరాల్లో 4వేల ఎకరాల వరకు విలువైన భూములను పరిశ్రమల స్ధాపన నిమిత్తం వివిధ పారిశ్రామిక సంస్ధలకు కట్టబెట్టాయి. కాని అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయకుండా వాటిని నిరుపయోగంగా ఉంచినట్లు తెలంగాణ పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్ధ గుర్తించింది. ఈ విషయమై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు పరిశ్రమల శాఖ నివేదిక ఇచ్చింది. తొలి దశలో పరిశ్రమల శాఖ చేపట్టిన డ్రైవ్‌లో 1300 ఎకరాలు నిరుపయోగంగా, లేదా పాక్షికంగా మాత్రమే ఉపయోగించినట్లు గుర్తించారు. ఇంతవరకు 205 పరిశ్రమల నుంచి దాదాపు 700 ఎకరాల భూములను పరిశ్రమల శాఖ స్వాధీనం చేసుకుంది. మరో 150 పరిశ్రమల నుంచి 600 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక ఆర్ధిక మండళ్లను గత ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. వీటికి కేటాయించిన విలువైన భూములను చాలా పరిశ్రమలు ఉపయోగించుకోలేదు. ఇంతవరకు బ్రహ్మణి సెజ్ నుంచి 250 ఎకరాలుల, హిందూజ ఫౌండ్రీ నుంచి 60 ఎకరాలు, విజువల్ సాఫ్ట్ నుంచి 7.5 ఎకరాలు, సైబరాబాద్ బయోటెక్ నుంచి 25 ఎకరాలు, లోన్‌జా సంస్ధ నుంచి 10 ఎకరాలను పరిశ్రమల శాఖ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాష్ట్రప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,45,682 ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్‌లో ఫార్మాసిటీ, నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, మెగా టెక్స్‌టైల్ పార్కు, మెడికల్ పరికరాల పార్కు మహేశ్వరం, దండుమల్కాపూర్‌లో ఫర్నీచర్ పార్కు, జనగాం వద్ద లేదర్ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మియాపూర్, బద్వేల్, తెల్లాపూర్, బాచుపల్లి, దిండిగల్, అమీనాపూర్‌లో కూడా ఐటి పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో ఫార్మా సిటీకి 5669 ఎకరాలు, నిమ్జ్ జహీరాబాద్‌కు 2800 ఎకరాలు, మెగా టెక్స్‌టైల్‌పార్కు వరంగల్ వద్ద 876 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది.