తెలంగాణ

కవిత సైకత శిల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా ఒడిశాలోని పూరీలో ఆమె సైకత శిల్పం రూపొందించారు. కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దీన్ని రూపొందించారు. కవిత సైకత శిల్పం పక్కన హ్యాపీ బర్త్‌డే కవితా జీ అని రాశారు. తెలంగాణ జాగృతి పేరుతో తెలంగాణ జాగృతి వరంగల్ అర్బన్ అధ్యక్షుడు కొరబోయిన విజయ్ ఈ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించారు. ప్రఖ్యాత సైకత శిల్పి జితేందర్ సాహు ఆదివారం ఉదయం ఈ సైకత కళాఖండం తయారు చేశారు. పూరీలోని మాడల్ బీచ్‌లో ఈ సైకత శిల్పం ఏర్పాటు చేశారు. సోమవారం కవిత జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి కువైట్ శాఖ అధ్యక్షుడు ముత్యాల వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్ జోన్ ఫ్యామిలీ హాస్పటల్ లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. తెలంగాణకు చెందిన పలువురు రక్తదానం చేశారు. నర్సింగరావు, ఓమ్ ప్రకాశ్, సంగు నర్సయ్య, డాక్టర్ జేమ్స్,గంగాధర్ తదితరులు కార్యక్రమం నిర్వహించారు.