తెలంగాణ

దళితులకు భూమి.. చెప్పినంత అందదేమి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీలకు హామీ ఇచ్చిన భూమి కొనుగోలు పథకం అమలుకు నిధుల కొరత, అధికారుల్లో చిత్తశుద్ధి లేమి వెంటాడుతోంది. గత రెండేళ్లలో పేద దళితులకు భూమి కొనుగోలుకు రూ. 1400 కోట్లు కేటాయించగా, ఖర్చుపెట్టింది కేవలం రూ. 259 కోట్లు మాత్రమే. బడ్జెట్‌లో నిధులు భారీగానే కేటాయిస్తున్నా, అనుకున్న లక్ష్యం సాధించడంలో ప్రభుత్వం యంత్రాంగం విఫలమవుతోంది. భూమి లేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు భూమి కొనుగోలు పథకాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు 2014 ఆగస్టు 15వ తేదీన ఆడంబరంగా ప్రారంభించారు. భూమి లేనటువంటి ఎస్సీ కుటుంబాల్లో మహిళలకు మూడు ఎకరాల వ్యవసాయ భూమిని, మొదటి దశలో అర ఎకరం, ఒక ఎకరం, రెండు ఎకరాలు ఉన్న దళిత కుటుంబాలకు మిగిలిన భూమిని రెండవ దశలో కొన్ని ఇచ్చి సంపూర్ణంగా మూడు ఎకరాల భూమికి యజమానురాలిగా చేయాలనే సంకల్పంతో ఈ స్కీంను ప్రవేశపెట్టారు.
భూమి కొనుగోలు పథకం కింద ఎటువంటి లబ్ధిదారుల వాటా లేకుండా వంద శాతం సబ్సిడీతో అమలు చేస్తారు. భూమి ఎకరం రెండు లక్షల రూపాయల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు కొనుగోలు చేసే అధికారం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది జిల్లాల కలెక్టర్లకు ఇచ్చారు.
ఈ స్కీంను 2014-15, 2015-16 సంవత్సరాల్లో అమలు చేశారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత దళితులకు కెసిఆర్ ఇచ్చిన గొప్ప వరం భూమి కొనుగోలు పథకం. తొలి ఏడాది బడ్జెట్‌లో రూ. 900 కోట్లు కేటాయించారు. ఆరు వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమలులోకి వచ్చేసరికి రూ. 70.60 కోట్ల వ్యయంతో 638 కుటుంబాలకు భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేశారు. రెండవ ఏడాది 2015-16 బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కేటాయించి 3334 కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆచరణలో మాత్రం విఫలమయ్యారు. 1704 కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. రూ. 188.53 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. రెండేళ్లలో రూ. 1400.10 కోట్ల నిధులు ఖర్చుపెట్టి 9334 మందికి భూమి కొనుగోలు పథకాన్ని వర్తింప చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే రూ. 259 కోట్లు ఖర్చుపెట్టి 2342 కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూర్చారు. వచ్చే ఏడాది భూమి కొనుగోలు పథకానికి బడ్జెట్‌లో రూ. 600 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది పదివేల ఎకరాల భూమిని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపు 3350 ఎస్సీ కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున భూమి కొనుగోలు చేసి ఇవ్వాలని నిర్ణయించారు.
వాస్తవానికి ఇది మంచి స్కీం. తెలంగాణ రాష్ట్రంలో 2011 జనాభా ప్రకారం 3.48 కోట్లలో ఎస్సీల జనాభా 54.09 లక్షల ఉంది. అంటే 15.54 శాతం మంది ఎస్సీలు ఉన్నారు. భూమి కొనుగోలు పథకంలో సమకూర్చిన భూమిలో సమగ్ర ప్యాకేజీని సమకూర్చే యోచనలో భాగంగా భూమికి సాగునీరు, డ్రిప్, విత్తనాలు, దునే్నందుకు అయ్యే ఖర్చు, విత్తనాలు, పురుగుమందు, పంట ఖర్చులు, సూక్ష్మ నీటిపారుదల, పంపుసెట్ల విద్యుద్దీకరణ కల్పిస్తారు. మొదటి సంవత్సర పంటకు భూమి అభివృద్ధికి, నర్సరీల తయారీకి, వ్యవసాయ ఇన్‌పుట్‌ల కొరకు అయ్యే ఖర్చును లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఇంతగొప్ప పథకం అమలులో ఎందుకు విఫలమవుతున్నారో ముఖ్యమంత్రి ఆరా తీసి చర్యలు తీసుకుంటేతప్ప దళితులకు మేలు జరగదు.