తెలంగాణ

ఇక పార్టీ పటిష్ఠతపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: అధికారంలోకి వచ్చి మూడేళ్ల కాలం గడిచిపోయింది, ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువు ఉండడంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్రమంగా పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. మొదటి మూడేళ్ల పాటు తెలంగాణ భవన్‌కు ముఖ్యమంత్రి చాలా తక్కువగా వచ్చారని, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పార్టీలో చేరిన సందర్భంలో తప్ప తెలంగాణ భవన్‌లో పెద్దగా కార్యక్రమాలు జరగలేదు. చివరి రెండేళ్ల సమయంలో కీలకం కావడంతో తిరిగి పార్టీ కార్యక్రమాలపై దృష్టిసారించారు. ఈసారి టిఆర్‌ఎస్ ప్లీనరీ ఏప్రిల్ 27న వరంగల్‌లో నిర్వహించనున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత తొలి ప్లీనరీ హైదరాబాద్‌లో ప్లీనరీ నిర్వహించారు. నిరుడు ఖమ్మంలో ప్లీనరీ నిర్వహించారు. ఈసారి వరంగల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. 60 లక్షల మంది సభ్యులను చేర్చుకోవాలని లక్ష్యం పెట్టుకున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారు, ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్లు అంతా కలిసే సభ్యత్వ నమోదు చేపట్టినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెలాఖరు వరకు సభ్యత్వ నమోదు జరుగుతుంది. అనంతరం దశల వారిగా కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తారు. ప్లీనరీ నుంచి కొత్త కమిటీలు పని ప్రారంభిస్తాయి. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ శ్రేణులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. శాసన సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లకు ప్రత్యేకంగా శిక్షణ నిర్వహించారు. అయితే పార్టీ పరంగా శిక్షణ మాత్రం నిర్వహించలేదు. ప్లీనరీ అనంతరం శిక్షణ నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పేరుతో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించక పోయినా కుల సంఘాలు, వృత్తి సంఘాలతో నిరంతరం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు పార్టీకి ఉపయోగపడతాయని టిర్‌ఎస్ వర్గాలు తెలిపారు. ఇంటింటికి మంచినీళ్లు, డబుల్ బెడ్‌రూమ్, ఆసరా పెన్షన్‌ల వంటివి టిఆర్‌ఎస్‌కు గ్రామ స్థాయిలో బాగా బలాన్ని పెంచాయని పార్టీ వర్గాలు తెలిపారు. ఈ పథకాల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం సాగించాలని నిర్ణయించారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేయనున్న పథకాల గురించి విపక్షాల విమర్శలే పార్టీకి శ్రీరామ రక్ష అని పార్టీ సీనియర్ నాయకులు చెప్పారు. మత్స్యకారులు, గొర్రెల పెంపకం దారులు, చేనేత కార్మికులకు ప్రకటించిన పథకాలపై విపక్షాలు విమర్శలు చేసినా, ఈ పథకాల అమలు విజయవంతంగా నిర్వహిస్తే ప్రజల్లో పార్టీ పట్ల అభిమానం పెరుగుతుందని, పార్టీ శ్రేణులు ఈ అంశాలపై దృష్టి సారించే విధంగా ప్లీనరీలో నిర్ణయాలు తీసుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.