తెలంగాణ

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఆదివారం జరిగిన పోలింగ్‌లో 82.49 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 70.04శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా, గద్వాలలో అత్యధికంగా 91.13 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వనపర్తి జిల్లాలో 90.82శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రంగారెడ్డిలో 80.64 శాతం మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో 90.02శాతం మంది, నాగర్ కర్నూల్‌లో 90.60 శాతం మంది, మేడ్చెల్‌లో 76.77శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభమై, సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. 82.38 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్వైత కుమార్ సింగ్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌తో పాటు ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు ఇద్దరు వీడియో కెమెరామెన్‌లను నియమించి, వీడియోగ్రఫీ చేయించారు. హైదరాబాద్ అంబర్‌పేట ఇండోర్ స్టేడియం నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించినట్టు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తలేదని తెలిపారు. ప్రత్యేక పరిశీలకులు రజత్ కుమార్ హైదరాబాద్ నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, పోలింగ్ సరళి పరిశీలించారు. మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల నుండి బ్యాలెట్ బాక్సులు అంబర్‌పేట స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నారు. ఈనెల 22న ఉదయం ఎనిమిది గంటలకు ఓట్లు లెక్కిస్తారు. ఈనెల తొమ్మిదిన ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఓటర్ల జాబితాలో ఇద్దరు అభ్యర్థుల ఫోటోలు తారు మారు కావడంతో పోలింగ్ రద్దు చేసి ఆదివారం తిరిగి నిర్వహించారు.