రాష్ట్రీయం

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కొత్తగా 14 వరద హెచ్చరిక కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: దక్షిణ భారతదేశంలో రానున్న రోజుల్లో భారీ ఎత్తున వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని అంతర్జాతీయ వాతావరణ కేంద్రం ప్రకటించడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి గమనం తెలుసుకునేందుకు, వర్షపాతం వివరాల నమోదు, అంచనాల నివేదికను తయారుచేసేందుకు కొత్తగా 14 వరద హెచ్చరిక కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని రెండు రాష్ట్రప్రభుత్వాలకు తెలిపింది. దశలవారీగా 2017 మార్చిలోపల వరద హెచ్చరిక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇ-ఉపరితల జల సమాచార వ్యవస్ధ పరిధి కింద ఈ కేంద్రాలను నెలకొల్పుతారు. రానున్న 72 గంటల్లో వరదలు, భారీ వర్షాలు, నదుల్లో నీటి గమనాన్ని ఆటోమేటిక్ సెన్సార్ ఆధారిత శాటిలైట్ ఆధారిత డాటా, రియల్ టైం వరద పరిస్ధితి, మీడియం రేంజి హైడ్రాలజిక్, హైడ్రాలిక్ మాడ్యూల్స్‌ను సంకలనం చేసి వరద హెచ్చరిక సందేశాలను జారీ చేస్తారు. ఆంధ్రాలో ప్రస్తుతం గోదావరి, కృష్ణా, వంశధార బేసిన్లలో వరద పరిస్ధితిని అంచనా వేసే కేంద్రాలున్నాయి. తెలంగాణలో గోదావరి, కృష్ణా నదుల్లో వరద, నీటి గమనాన్ని అంచనావేసే నాలుగు స్టేషన్లు ఉన్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో ఇటీవల భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. 2005లో ముంబయిని భారీ వర్షాలు అపారనష్టాన్ని కలిగించాయి. అలాగే 2009లో శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు తెలంగాణ, ఆంధ్రా ద్వారా సముద్రంలోకి వెళ్లింది. త్వరలో కేంద్ర జల సంఘం బృందం రెండు రాష్ట్రాల్లో పర్యటించి వరద హెచ్చరిక కేంద్రాల ఏర్పాటును పరిశీలించి నివేదిక సమర్పించనున్నారు.

రెండో విడత డిసెట్‌లో 8533 సీట్లు భర్తీ

హైదరాబాద్, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లోని డైట్ కాలేజీల్లో రెండో విడతలో 8533 సీట్లు భర్తీ కావలసి ఉందని పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకురాలు పి పార్వతి తెలిపారు. మొదటి విడత కౌనె్సలింగ్ నవంబర్ 23 నుండి డిసెంబర్ 5వ తేదీ వరకూ నిర్వహించామని, రెండోవిడత ఈ నెల 14వ తేదీన ప్రారంభించామని చెప్పారు. మొదటి విడత కౌనె్సలింగ్‌లో డైట్ కాలేజీల్లో ఉన్న సీట్లు సంఖ్య 19,530 గానూ 16,802 అభ్యర్ధులు అలాట్ చేస్తే 13,003 అభ్యర్ధులు జాయిన్ అయ్యారని , రెండోవిడతలో అదనంగా 76 కాలేజీల్లో 3160 సీట్లు అదనంగా మంజూరయ్యాయని అన్నారు. దాంతో మొత్తం 8533 సీట్లు భర్తీ కావల్సి ఉందని చెప్పారు.
విశాఖ ఉత్సవ్ వాయిదా
డిసెంబర్ 25 నుండి మూడు రోజుల పాటు జరగాల్సిన విశాఖ ఉత్సవ్‌ను వాయిదా వేస్తున్నట్టు మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఈ ఉత్సవ్‌ను 2016 జనవరి 1,2,3 తేదీల్లో నిర్వహిస్తామని ఆయన చెప్పారు. క్రిస్మస్ పండుగ దృష్ట్యా క్రైస్తవ సంఘాల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.