తెలంగాణ

తెలంగాణలో సంచరిస్తున్న కర్నాటక హంతక ముఠా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మార్చి 19: అత్యంత కిరాతకమైన ముఠా ఒకటి తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గుల్బర్గా, బీదర్ ప్రాంతాలకు చెందిన ముఠా ఒకటి తెలంగాణ రాష్ట్రంలో సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇలాంటి ముఠా రాత్రి వేళల్లో ఇళ్ల ముందు వారి వెంట ఉన్న చిన్నపిల్లలను ఏడిపిస్తుంటారు. ఈ ఏడుపులకు ఇంట్లో ఉన్నవారు బయటకు రాగానే వారిపై మారణాయుధాలతో దాడులు జరిపి కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్వాత వారి అవయవాలను విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు. రాత్రి పూట చిన్నపిల్లల అరుపుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి అరుపులకు ఎవరు కూడా తలుపులు తెరవ వద్దని హెచ్చరిస్తున్నారు. అన్ని పోలీస్ స్టేషన్‌లలో రాత్రి వేళల్లో పోలీస్‌లు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ ముఠా ఇళ్లలో దోపిడీలకు కూడా పాల్పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. అత్యంత కిరాతకమైన ఈ ముఠా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. ఇలాంటి ముఠాపై ఎవరికైనా అనుమానం వచ్చినట్లైతే దగ్గర్లో ఉన్న కంట్రోల్ రూంకు ఫోన్ చేయాలని పోలీసులు కోరారు.