తెలంగాణ

అర్చకుల వేతనాలు ట్రెజరీల ద్వారా చెల్లించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: అర్చకులకు ట్రెజరీల ద్వారా జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదని, అది సాధ్యం కాదని దేవాదాయ మంత్రి ఎ ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఒడితెల సతీష్‌కుమార్, దాస్యం వినయ్ భాస్కర్, మలిపెద్ది సుధీర్‌రెడ్డి తదితరులు సోమవారం నాడు శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత బడ్జెట్‌లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు వంద కోట్లు కేటాయించామని, ఈ బడ్జెట్‌లోనూ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు వంద కోట్లు కేటాయించామని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా గోపన్నపల్లిలో బ్రాహ్మణ సదన్ నిర్మిస్తామని ఇందుకోసం ఆరు ఎకరాల 10 కుంటలు స్థలాన్ని కూడా కేటాయించామని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు కె వి రమణాచారి సహా 17 మందితో సలహా కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు.