తెలంగాణ

వడదెబ్బతో ఆరుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్/నల్లగొండ, మార్చి 24: భానుడి భగభగలకు పశుపక్ష్యాదులతోపాటు మనుషులు కూడా అల్లాడుతున్నారు. వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఆరుగురు వ్యక్తులు వడదెబ్బతో మరణించారు. వరంగల్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ముసునూరి నాగమ్మ (55) బుధవారం మిరప కాయలు ఏరేందుకు కూలీకి వెళ్లి, ఇంటికి వచ్చిన అస్వస్థతకు గురై గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. మండల కేంద్ర శివారు లచ్చిరాం తండాకు చెందిన మూడు నర్సింహా (34) గురువారం మిరప కూలీకి వెళ్లి చేనులో కూలిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. చిట్యాల మండలం రామకృష్ణపూర్(వి) గ్రామానికి చెందిన ముత్యాల కుమారస్వామి(40) అనే వ్యక్తి వడదెబ్బతో గురువారం మృతి చెందాడు. నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం తుమ్మలతండాకు చెందిన ఎం.సుబ్బానాయక్(60) రోజుమాదిరిగానే కూలిపనికి వెళ్ళిరాగా బుధవారం అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వేములపల్లి మండలానికి చెందిన పుట్టల నర్సమ్మ (55) బుధవారం పొలం వద్ద వ్యవసాయ పనులకు వెళ్ళగా రాత్రి అస్వస్థతకు గురైంది. ఆమెకు ప్రాథమిక వైద్యం అందించగా గురువారం ఉదయం మృతి చెందింది. మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన మేకల ఎల్లయ్య (40) అనే లారీ డ్రైవర్ వడదెబ్బకు గురై బుధవారం అర్ధరాత్రి మరణించాడు. బుధవారం డ్యూటికి వెళ్లిన డ్రైవర్ ఎల్లయ్య లారీని ఇంటి వద్దనే ఆపి నీరసించి ఇంట్లోనే పడుకున్నాడని, పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స పొందుతూ మరణించాడు.