తెలంగాణ

రేషన్ కార్డుల దుర్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణలో కొంత మంది రేషన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. జి కిషన్‌రెడ్డి, డాక్టర్ కె లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులు శాసనసభలో అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి బదులిచ్చారు. రూపాయికే కిలో బియ్యం పథకానికి ప్రభుత్వం 6380 కోట్లు వెచ్చిస్తోందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 2665 కోట్లు భరించగా, కేంద్రం 3717 కోట్లు ఇచ్చిందని వివరించారు. రేషన్ కార్డులను తొలగించాలని ప్రభుత్వం ఎన్నడూ భావించడం లేదని, కాకపోతే కొంత మంది రేషన్‌కార్డులను ఆరోగ్య శ్రీ పథకం కోసం, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కోసం దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 2015లో కేంద్రం తెలంగాణలో 1.91 కోట్ల మందికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపచేస్తే తాము మాత్రం 2.74 కోట్ల మందికి రూపాయికే కిలోబియ్యం పథకం వర్తింపచేశామని అన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రం అనేక నియమనిబంధనలను రూపొందించిందని, అందులో గ్రామాల్లో 60వేల ఆదాయం మించరాదని, పట్టణాల్లో 75 వేల ఆదాయం మించరాదనేది కూడా ఒక నిబంధన అని చెప్పారు. దానిని తాము సడలించి గ్రామాల్లో 1.50 లక్షల ఆదాయం, పట్టణాల్లో 2 లక్షల ఆదాయం ఉన్నవారికి కూడా కిలోబియ్యం పథకం అమలుచేస్తున్నామని అన్నారు. ఒక కుటుంబానికి 20 కిలోలకు మించి ఇవ్వరాదనే సీలింగ్‌ను కూడా తొలగించామని చెప్పారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున బియ్యం ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదని అన్నారు. కొత్త కార్డులు ఇచ్చేందుకు తాము ముద్రణకు ఆదేశాలు ఇచ్చామని, అయితే కొత్త జిల్లాల ఆవిర్భావంతో వాటిని ఆపామని, త్వరలోనే కార్డులు ముద్రించి అర్హులు అందరికీ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖలో అవినీతి అక్రమాలను నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలూ చేపట్టామని వెల్లడించారు. తెలంగాణలో 3 కోట్ల మంది ఉండగా, 2.74 కోట్ల మందికి కార్డులు ఇచ్చామని పేర్కొన్నారు.
అంతకు ముందు ఈ అంశానికి సంబంధించి సుదీర్ఘ చర్చ జరిగింది. తొలుత కిషన్‌రెడ్డి తాను ఇచ్చిన ప్రశ్నలో కొన్ని అంశాలను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేయగా, ఇక మీదట అలా జరగకుండా చూస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. రాష్ట్రం వెచ్చిస్తున్న నిధుల కంటే కేంద్రం ఎక్కువ ఖర్చు చేస్తున్నందున, ప్రధానమంత్రి ఫొటోను వివిధ ప్రకటనల్లో ముద్రించాలని లక్ష్మణ్ కోరారు.

చిత్రం..ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ జన్మదినం సందర్భంగా సోమవారం పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెబుతున్న మంత్రి హరీశ్‌రావు, స్పీకర్ మధుసూదనాచారి