తెలంగాణ

భగీరథలో అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: రాష్ట్ర శాసనసభలో మున్సిపల్ వ్యవహారాల పద్దుపై బుధవారం చర్చ జరిగిన సందర్భంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్, బిజెపి వాకౌట్ చేశాయి. మిషన్ భగీరథ, ఓఎఫ్‌సి కేబుల్ కలిపేస్తున్నారని, ఈ కాంట్రాక్టులో 10 వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై విచారణకు సభాకమిటీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్‌పక్షం నేత కె జానారెడ్డి, సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు మాట్లాడుతూ వాస్తవాలు వెల్లడయ్యేందుకు సభాకమిటీ (హౌజ్‌కమిటీ) వేయాలని డిమాండ్ చేశారు. అయితే శాసనసభా కమిటీ వేసేందుకు ప్రభుత్వం ఆమోదించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేస్తున్నట్టు జానారెడ్డి ప్రకటించి కాంగ్రెస్ సభ్యులతో సభ నుంచి వెళ్లిపోయారు. మిషన్ భగీరథ కాంట్రాక్ట్‌ను ఆంధ్రప్రదేశ్ గుత్తెదారులకు కట్టబెట్టారని, వారికి తెలంగాణ డబ్బు ప్రభుత్వం దోచిపెడుతోందంటూ కోమటిరెడ్డి ఆరోపించారు. సభాకమిటీ వేస్తే వాస్తవాలు నిరూపిస్తానని, తనవద్ద తగినన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ విమర్శించడం తెరాసకు ఫ్యాషన్‌గా మారందని దుయ్యబట్టారు. రాష్ట్ర రాజధానిలో ఆస్తి పన్ను భారీగా పెంచారని, డబుల్ బెడ్‌రూం ఇళ్లు సనత్‌నగర్ వినా హైదరాబాద్‌లో ఎక్కడా నిర్మించలేదని, పట్ణణాభివృద్ధిలో ప్రభుత్వం చెబుతున్న మాటలకు, అమలవుతున్న అంశాలకు పొంతనే ఉండటం లేదని ఆరోపిస్తూ బిజెపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. తాగునీటి అంశంతోపాటు ఇతర అంశాలపై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బిజెపిపక్షం నేత కిషన్‌రెడ్డి ఆరోపిస్తూ, ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు. కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులపైనే దృష్టిపెట్టారని, తమ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలన్న అంశంపై దృష్టి కేంద్రీకరించిందని పురపాలక మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు మిషన్ భగీరథను పరిశీలించేందుకు తెలంగాణకు వస్తున్నారని గుర్తు చేశారు. విపక్షాలు మంచి సూచనలు చేస్తే అమలు చేస్తామని కెటిఆర్ పేర్కొన్నారు.