తెలంగాణ

హెచ్‌సిఎ నిర్వహణకు కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: రానున్న ఐపిఎల్ మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) వ్యవహారాల పర్యవేక్షణకు ఇద్దరు మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీని నియమిస్తూ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ ఆర్ దావే, హైకోర్టురిటైర్డు జడ్జి జస్టిస్ జివి సీతాపతిని నియమించినట్లు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఐపిఎల్ 2017 మ్యాచ్‌ల పర్యవేక్షణకు అడ్మినిస్ట్రేటర్లను లేదా పరిశీలకులను హెచ్‌సిఏకు నియమించాలని కోరుతూ బిసిసిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. హెచ్‌సిఏలో ఆధిపత్యం కోసం రెండువర్గాలు తగాదా పడుతున్నాయని హైకోర్టు పేర్కొంది. ఐపిఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నంత వరకు, అలాగే లోథా కమిటీ నివేదిక సిఫార్సులు అమలయ్యే వరకు ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. వచ్చే ఆరు నెలల్లోగా జస్టిస్ లోథా కమిటీ సిఫార్సులు అమలవుతాయని భావిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. అడ్మినిస్ట్రేటర్లుగా నియమితులైన న్యాయమూర్తుల కమిటీ హెచ్‌సిఏతో, ఫ్రాంచైజీలతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంటుందన్నారు. హెచ్‌సిఏకు వచ్చే అన్ని వనరుల ఏజన్సీలతో కూడా ఈ ఒప్పందం ఉంటుందన్నారు. ఈ సొమ్మును హెచ్‌సిఏ బ్యాంకులో డిపాజిట్ చేస్తారని, ఐపిఎల్ మ్యాచ్‌లు సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను ఈ కమిటీ తీసుకుంటుందన్నారు. ఒక ఆర్థిక సలహాదారును కూడా న్యాయమూర్తి కమిటీ నియమిస్తుందన్నారు. బిసిసిఐ కమిటీని సంప్రదించి ఈ నియామకం చేయాలన్నారు. లోథా కమిటీ సిఫార్సుల అమలు పూర్తయిన తర్వాత హెచ్‌సిఏ నిబంధనల మేరకు కొత్తగా ఎన్నికైన కమిటీకి న్యాయమూర్తుల కమిటీ హెచ్‌సిఏ బాధ్యతలను అప్పగిస్తుందన్నారు.