తెలంగాణ

‘ఎండలపై చర్యలు చేపట్టండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: ఈసారి గతంలో ఎప్పుడూ లేని విధంగా అసాధారణ స్థాయిలో ఎండలు ఉంటాయని, ఎండలు అప్పుడే ప్రారంభం అయ్యాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులు రంగంలోకి దిగి తగిన చర్యలు చేపట్టాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ బిపి ఆచార్య సూచించారు. అసాధారణ వాతావరణ పరిస్థితులపై గురువారం నిర్వహించిన ఒక రోజు వర్క్‌షాప్ ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ఎండ వేడి నష్టాన్ని తగ్గించేందుకు అవసరం అయిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లా స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. స్థానిక భాషల్లో ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ ప్రచారం చేయాలని చెప్పారు. స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ, ఇండియన్ మెట్రోలాజికల్ సొసైటీ హైదరాబాద్ చాప్టర్ , తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వర్సిటీకి చెందిన పలువురు నిపుణులు సదస్సులో పాల్గొన్నారు.